శనివారం 4 ఫిబ్రవరి 2012

ఒక మిత్రుడు , నేను


ఒక  మిత్రుడు  నేను  సరదాగా  హైటెక్  సిటీ  లో  మాట్లాడుకుంటున్నాం,  బోజన  విరామ  సమయం  లో .
వాడికి  దూమపానం అంటే  మహా  ఇష్టం ,చెప్పినా మానడు.

అప్పుడు  ఒకటి  ఊదుతున్నాడు .దానికి  నేను  తిట్టినా  పెద్దగా పట్టించుకోడు .
సర్లే  అని  ఊరుకోకుండా  “ఎందుకు  రా అస్తమాను  అలా  దూమపానం చేస్తావు  అన్నాను  “?దానికి  వాడు  “ఒరేయ్   సాయి  ,సాఫ్ట్వేర్  లో  చాలా  మంది  ఉద్యోగస్తులు  చూడు  వాళ్ళకి  ఒకటి  కామన్  గా  అలవాటు ఉంటుంది  అది  ఈ   దూమపానం  అని ”చిరున్నవ్వు  నవ్వాడు .

”పోగతాగేవాడికి    మరల  కారణాలు  ఒకటి  అని ”తిట్టా!!
అప్పుడు  వాడు  SAP నేర్చుకుంటున్నాడు .”ఏమో  కొన్ని  రోజులకి  నాకు  ఉద్యోగం వస్తే ,మరలా ఇలాగె  ఇక్కడికి   వచ్చి  వాళ్ళ లాగానే ఉద్యోగం తో పాటు  దమ్ము  కొడతా! ”అన్నాడు  .
అలా  మా  మధ్య  మాటలు  ముగిసాయి ,నన్ను రూం దగ్గర వదిలి వెళ్ళాడు .

సరిగ్గా  నెలరోజులు  కూడా  గడవ  లేదు .నన్ను బండి మీద హైటెక్ సిటీ కి తీసుకు వెళ్ళాడు .ఏమిటి రా ?ఎక్కడికి అని అడిగా ?మరలా అదే  ప్రదేశం లో ఆపాడు .అప్పుడు హ్యాపీ గా చెప్పాడు , వాడికి  "మంచి సాఫ్ట్ వేర్  కంపనిలో  ఉద్యోగం  వచ్చింది "అని .పాత సంగతని తలుచుకొని చాలా  త్రిల్  అయ్యాం.సరదాగా అన్న  మాటలు నిజం అయితే ఎంత ఆనందం ఉంటుందో వాడి కళ్ళలో చూసా...

3 comments:

  1. Baaabu gaaru, meeru paatha smruthulu gurthu chesthunnaru. Aa bangaru dinaalni, madura smruthulni nenu kuda bhadram ga manasu lone daachukunnanu. Antha baane vundi kaani maastaaru, akkada dhooma paanam gurinchi avasarama baabu....daani place lo chai ani anunte entha baagundedi. Ne mithrullo SAP meeda chesa ekaika vedava ni nene baabu, kaabatti ila thamaru publicity cheyakkarledu. Nenu already maanesanu ikkada dhooma paananni.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. నిజమే కదూ! మీ స్నేహితునికి బెస్ట్ విషెస్ చెప్పండి!

    ప్రత్యుత్తరంతొలగించు
  3. rasajna garu tappakunda...
    babu malli SAP lo inka kontamandi unnaru,nenu peru rayaleduanduke gaa nuvve cheppukune durada endukamma!!

    ప్రత్యుత్తరంతొలగించు